హైదరాబాది చికెన్ ధం బిర్యానీ Chicken dum biryani recipe

 చికెన్ ధం బిర్యానీ తాయారీ విధానం Step by step

 పరిచయం:


ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోగల చికెన్ దమ్ బిర్యాని మనం ఎటువంటి కెమికల్స్ మరియు ఎటువంటి హానికరమైన మసాలాలు వేయకుండా ఇంట్లోనే చాలా జాగ్రత్తగా మనకు ఇష్టమైన రీతిలో వండుకునేటట్టు చికెన్ దమ్ బిర్యాని రెసిపీ. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే చికెన్ దమ్ బిర్యాని సులభంగా ఎలా చేసుకోవాలో ఈ రెసిపీని చూసి నేర్చుకోవచ్చు. మొదటిసారి చేసే వాళ్ళు కూడా సులభంగా చేసుకునే రీతిలో చెప్పడం జరిగింది.


దీనికి కావాల్సిన పదార్థాలు మరియు తయారయ్యే విధానం కింద రాయబడిన రెసిపీ నోట్లో చూడొచ్చు మీరు చూసి నేర్చుకోవచ్చు.


 కావాల్సిన పదార్థాలు :


1. బాస్మతి బియ్యం: 1kg(1000grams)


2. చికెన్ : 1kg(1000grams)


3. పెరుగు : half liter


4. ఉల్లిపాయలు:500 grams


5. పచ్చిమిరపకాయలు :10


6. కారం :రుచికి సరిపడేంత 


7. ఉప్పు: రుచికి సరిపడేంత 


8. పసుపు:3( మూడు టేబుల్ స్పూన్లు )


9. నూనె :ఒక కప్పు(1 cup)


10. ధనియాలు:3( మూడు టేబుల్ స్పూన్లు )


11. మిరియాలు:2( రెండు టేబుల్ స్పూన్లు )


12. యాలుకలు:1( ఒక టేబుల్ స్పూన్ )


13. దాల్చిన చెక్క:4( నాలుగు చెక్కలు)


14. కస్తూరి మేతి :4( నాలుగు టేబుల్ స్పూన్లు )


15. అనాసపువ్వు :3( మూడు )


16. స్టార్ పువ్వు:3( మూడు)


17. బిర్యానీ ఆకు :4( నాలుగు)


18. సాజీర :10( 10 టేబుల్ స్పూన్లు )


19. నెయ్యి: ఒక కప్పు(1cup)


20. నిమ్మకాయలు:4( నాలుగు కాయలు )


21. టేస్టీ సాల్ట్ :3( మూడు టేబుల్ స్పూన్లు )


22. జాజికాయ:1( ఒకటి)


23. పుదీనా :ఒక కట్ట


24. కొత్తిమీర :ఒక కట్ట  


25. ఎండుమిరపకాయలు: రెండు


26. గరం మసాలా :2( రెండు టేబుల్ స్పూన్లు)


27. ధనియాల పొడి :3( మూడు టేబుల్ స్పూన్లు )


28. బిర్యానీ మసాలా :4( నాలుగు టేబుల్ స్పూన్లు )


29. జీలకర్ర పొడి :3( మూడు టేబుల్ స్పూన్లు)


30. లవంగాలు:5( ఐదు టేబుల్ స్పూన్లు )


31. అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక చిన్న కప్పు(1 small cup)


32. కుంకుమపువ్వు:1 spoon (ఒక టేబుల్ స్పూన్)


 చికెన్ మ్యారినేషన్:

 1. ముందుగా ఉల్లిపాయలు అన్నటిని సన్నగా కాస్త పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి.


2. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను ఒక బాండీలోకి వేసుకొని కాస్తంత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి.


3. ఉల్లిపాయలనేది మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.


4. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ను ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి.


5. అదే బౌల్లో వేసుకున్న చికెన్ తో పాటు ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి.


6. ఆ తరువాత మనం ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దాంట్లో వేయాలి.


7. ఆ బౌల్లోనే రుచికి సరిపడా కారం ఉప్పు మరియు ఒక టేబుల్ స్పూను పసుపు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి.


8. అదే చికెన్ లో మనం గరం మసాలాలు వేసుకోవాలి అంటే గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా కూడా వెయ్యాలి.


9. ఆ తర్వాత ముందుగానే కట్ చేసి జ్యూస్ తీసుకున్న నిమ్మకాయలను అంటే దాదాపు రెండు నిమ్మకాయల జ్యూస్ ను దాంట్లో వేయాలి.


10. ఆ తరువాత ఆ మిశ్రమంలోకి మనం కస్తూరి మేతి కాస్త తురుముకొని వేసుకోవాలి.


11. ఆ తర్వాత మారినేషన్ కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది.


12. ఇప్పుడు ఇందులోకి పొడుగ్గా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి.


13. అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనా తరుగు వెయ్యాలి.


14. ఇందులోనే మనం జాజికాయని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొడి చేసుకుని వేసుకోవాలి.


15. ఈ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత మనం చికెన్ ని బాగా మసాజ్ చేసుకోవాలి ఈ మసాలాతో. చికెన్ ని బాగా కలుపుకున్న తర్వాత దాదాపు ఒక రెండు మూడు గంటలు వరకు చికెన్ ని పక్కన ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.




 తయారీ విధానం:

ముందుగా మనం అన్నం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి దాని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం….


1. మొదటిగా మనం పెద్ద తపాలా తీసుకోవాలి.


2. దానిలోకి మనం 1:2 రేషియోలో మనం వాటర్ తీసుకుని పెట్టుకోవాలి. అంటే (ఒక కప్పు రైస్ కు రెండు కప్పుల వాటర్ అన్నట్లు)


3. ఆ తర్వాత దానిలోకి ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, టేస్టీ సాల్ట్, రెండు ఎండు మిరపకాయలు, కాస్తంత మిరియాలు, అనాస పువ్వు మరియు స్టార్ పువ్వు వీటన్నిటిని మనం తీసుకున్న వాటర్ లో వేసుకోవాలి.


4. ఇప్పుడు అదే వాటర్ లోకి మనకు టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి.


5. ఆ వాటర్ లోకి ఒక రెండు మూడు చెంచాల నెయ్యి మరియు ఒక రెండు చెంచాల నూనె వేసుకోవాలి.


6. అందులోనే కాస్తంత కొత్తిమీర పుదీనా తరుగు వేసుకొని బాగా వాటర్ మరిగించుకోవాలి.


7. ఆ వాటర్ మరిగిన తర్వాత ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ను అందులో వేసుకోవాలి.


8. ప్రైస్ అనేది పూర్తిగా ఉడకకుండా ఒక 70% మాత్రమే ఊరికే టట్టు చూసుకోవాలి.


9. దాదాపు ఒక 70% ఉడికిన తర్వాత ఆ వాటర్ అన్నీ మనం ఒక జల్లెడ గిన్నెలోకి స్ట్రైన్ చేసుకోవాలి రైస్ తో పాటు.


10. మనం ఆ రైస్ ని ఎక్కువ ఉడకకుండా చూసుకోవాలి.


 ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ తయారీ :


1. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద డేక్ష పెట్టుకోవాలి.


2. ఇప్పుడు దేశాలోకి మనం ఫ్రిజ్లోపే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ను మొత్తం కొంచెం కొంచెంగా వేసుకోవాలి.


3. చికెన్ అనేది దీక్షకి అడుగున ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి.


4. తర్వాత చికెన్ అనేది కొంచెం అంటే ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి.


5. 20% వరకు ఉడికిన తర్వాత చికెన్ ని లేయర్ గా మనం రైస్ వేసుకోవాలి.


6. ఇంకొక లేయర్ గా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మళ్లీ ఇంకొక స్టెప్పు రైస్ వేసుకోవాలి.


7. ఆ తర్వాత ఇంకొక లేయర్ గా కొత్తిమీర పుదీనా తరుగు వేసుకోవాలి.


8. చివరగా ఇంకొక లేయర్ గా రైస్ వేసుకోవాలి. మొత్తం ఇలా త్రీ లేయర్స్ గా వేసుకున్న తర్వాత పైన మిగిలి ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ మరియు కొత్తిమీర పుదీనా ఏవైనా ఉంటే వాటిపైన వేసుకోవాలి.


9. చివరన కుంకుమపువ్వు కలిపిన నీళ్లను అన్నం పైన ఈవెన్ గా పొయ్యాలి.


10. చివరగా కొంచెం నెయ్యి వేసి మనం దం పెట్టుకోవాలి. దమ్ పెట్టుకోవటానికి మనం టిష్యూ పేపర్లనేది కాస్త పైన క్లోజ్ చేసి లిడ్ పెట్టి పైన ఏదైనా బరువైన వస్తు పెట్టాలి అప్పుడు దమ్ము అనేది బయటికి పోకుండా ఉంటుంది. అప్పుడే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది దమ్ అనేది బాగా పడుతుంది అప్పుడు దమ్ బిర్యానీ టేస్ట్ గా ఉంటుంది.


11. మనం ఈ దమ్ని ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి.


12. దాదాపు ఒక అరగంట దాకా ఉడికిన తర్వాత చిన్నగా పైన బరువు తీసేసి ముక్క చెదరకుండా అటు ఇటు కనిపెట్టుకుంటూ బిర్యాని మరియు చికెను కలుపుకోవాలి.


 చిట్కాలు:

1. ఉల్లిపాయలను మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలంటే దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి.


2. చికెన్ సాఫ్ట్ గా మరియు జూసీగా రావాలంటే ఎంత ఎక్కువసేపు మనం మ్యారినేట్ చేసుకొని ఉంటే అంత టేస్టీగా ఉంటుంది.


 గమనిక:

1. బాస్మతి రైస్ ను ఎక్కువసేపు ఉడికించకూడదు. దాదాపు ఒక 70% ఉడికించుకోవాలి లేకపోతే ఎక్కువ ఉడికితే చిదిరిపోతుంది అంటే బియ్యం ముద్దగా అవుతుంది.


2. బాస్మతి రైస్ అనేది పొడిపొడిగా రావాలంటే మనం రైస్ ని ఉడికించుకునేటప్పుడు దానిలో నెయ్యి మరియు నూనె మోతాదు ఎక్కువగా ఉంటే రైస్ అనేది పొడిపొడిగా వస్తుంది.


 ఆరోగ్య సూత్రాలు:

 మనం ఈ విధంగా ఇంట్లోనే దమ్ బిర్యాని చేసుకోవడం వల్ల ఒంటికి చాలా మంచిది. మన ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. ఏ ఎటువంటి కెమికల్స్ మరియు హానికరమైన మసాలాలు వేయకుండా ఇంట్లోనే ఎప్పుడుకప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకునే దమ్ బిర్యాని వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది చికెన్ తినటం వల్ల మనం విటమిన్స్ అనేది పుష్కలంగా లభిస్తుంది. అవి మనకు రోగనిరోధ శక్తి పెంచుతుంది. పిల్లల్లో ఎదుగుదల పెంచుతుంది. అందుకే చికెన్ ఎప్పుడైనా ఒకసారి మామూలుగా కూర లాగా కాకుండా ఇట్లా దమ్ బిర్యాని లాగా కూడా ట్రై చేసి చూడొచ్చు.


 సర్వ్ చేసే విధానం :

 ఈ చికెన్ దమ్ బిర్యానీని రైతా మరియు మసాలా గ్రేవీ లాంటి దాంట్లో తింటే బాగుంటుంది. ఈ బిర్యానీలోకి గోంగూర టమాటా గోంగూర కూడా బాగుంటుంది. లేకపోతే ఉట్టిది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనం చికెన్ గ్రేవీ కూడా దాంట్లో ఉంది కాబట్టి. మనం ఈ డిష్ ని కొంచెం చికెన్ గ్రేవీ ఉన్నా చార్వాతో కూడా తినొచ్చు చాలా టేస్టీగా మరియు నోటికి రుచికరంగా ఉంటుంది..


 కంక్లూషన్ :

 ఏ విధమైన కెమికల్స్ వాడకుండా ఈ విధంగా పైన చెప్పినట్లు ఇంట్లోనే తయారు చేయడం దమ్ బిర్యాని చేసుకోవడం వల్ల చాలా మంచిది మనం ఆరోగ్యంగా ఉంటాము ఇంట్లోనే హోటల్ స్టైల్ మరియు రెస్టారెంట్లో తిన్నట్లు ఉండే విధంగా చేసుకొని తినడం వల్ల మనం కూడా చాలా హెల్దీగా ఉంటాము.


Comments