హైదరాబాది చికెన్ ధం బిర్యానీ Chicken dum biryani recipe
చికెన్ ధం బిర్యానీ తాయారీ విధానం Step by step పరిచయం: ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోగల చికెన్ దమ్ బిర్యాని మనం ఎటువంటి కెమికల్స్ మరియు ఎటువంటి హానికరమైన మసాలాలు వేయకుండా ఇంట్లోనే చాలా జాగ్రత్తగా మనకు ఇష్టమైన రీతిలో వండుకునేటట్టు చికెన్ దమ్ బిర్యాని రెసిపీ. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే చికెన్ దమ్ బిర్యాని సులభంగా ఎలా చేసుకోవాలో ఈ రెసిపీని చూసి నేర్చుకోవచ్చు. మొదటిసారి చేసే వాళ్ళు కూడా సులభంగా చేసుకునే రీతిలో చెప్పడం జరిగింది. దీనికి కావాల్సిన పదార్థాలు మరియు తయారయ్యే విధానం కింద రాయబడిన రెసిపీ నోట్లో చూడొచ్చు మీరు చూసి నేర్చుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు : 1. బాస్మతి బియ్యం: 1kg(1000grams) 2. చికెన్ : 1kg(1000grams) 3. పెరుగు : half liter 4. ఉల్లిపాయలు:500 grams 5. పచ్చిమిరపకాయలు :10 6. కారం :రుచికి సరిపడేంత 7. ఉప్పు: రుచికి సరిపడేంత 8. పసుపు:3( మూడు టేబుల్ స్పూన్లు ) 9. నూనె :ఒక కప్పు(1 cup) 10. ధనియాలు:3( మూడు టేబుల్ స్పూన్లు ) 11. మిరియాలు:2( రెండు టేబుల్ స్పూన్లు ) 12. యాలుకలు:1( ఒక టేబుల్ స్పూన్ ) 13. దాల్చిన చెక్క:4( నాలుగు చెక్కలు) 14. కస్తూరి మేతి ...